Nagarkurnool: కిసాన్ మోర్చా జిల్లా మీడియా కన్వీనర్‌గా వెంకటేశ్వరచారి

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా మీడియా కన్వీనర్‌గా ఇరువేంటి వెంకటేశ్వరచారి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ పత్రం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Oct 2026 8:32 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: కిసాన్ మోర్చా జిల్లా మీడియా కన్వీనర్‌గా వెంకటేశ్వరచారి

Nagarkurnool: బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా కిసాన్ మోర్చా మీడియా కన్వీనర్‌గా ఇరువేంటి వెంకటేశ్వరచారిని నియమించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నారాయణ చంద్రారెడ్డి అధ్యక్షతన, తల్లోజు ఆచారి, పోతుగంటి భరత్ ప్రసాద్, చారకొండ మండల అధ్యక్షుడు కృష్ణ సమక్షంలో నియామక కార్యక్రమం నిర్వహించారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ చేతుల మీదుగా వెంకటేశ్వరచారికి కిసాన్ మోర్చా జిల్లా మీడియా కన్వీనర్‌గా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ, కిసాన్ మోర్చా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో చురుకైన పాత్ర పోషించాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కిసాన్ మోర్చా నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY