Veldanda: గిరిజనులపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఖబర్దార్: శంకర్ నాయక్!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గిరిజన కులస్తులపై తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై శంకర్ నాయక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Veldanda: గిరిజనులపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఖబర్దార్: శంకర్ నాయక్!
వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గిరిజన కులస్తులపై అవాకులు చెవాకులు పేలిన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ రాష్ట్ర గిరిజన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బాణా వత్ శంకర్ నాయక్ తీవ్ర స్థాయిలో విరుచుకుప డ్డారు.ఆది వారం మండల కేంద్రంలోని గిరిజన భవనంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడారు.
స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ ఉద్య మంలో లంబాడాలు తమ ప్రాణా లను పణంగా పెట్టా రని అన్నారు.అనవసరంగా గిరిజనులపై విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ సమస్యలపై ప్రజాస్వామ్యబ ద్ధంగా కొట్లాడాలి కానీ ఇతరుల కులాలపై విమర్శలు చేయడం మానుకో వాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మాజీ మండలాధ్యక్షు డుహరి కిషన్ నాయక్ సర్పంచ్ లు రమేష్ నాయక్ రవీందర్ నాయక్ గణ్యా నాయక్ గిరిజన సంఘం నాయకులు పంతుల నాయక్ అరుణ్ నాయక్ లాలు నాయక్ నర్సింగ్ నాయక్ శ్రీను నాయక్ రఘు నాయక్ సుధీర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




