Veldanda: వెల్దండ మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా తానేష్ యాదవ్ ఏకగ్రీవం
Veldanda: వెల్దండ మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా పోతేపల్లికి చెందిన తానేష్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక. నియామక పత్రం అందజేసి సత్కరించిన జిల్లా నేతలు లాలు, జంగయ్య యాదవ్.
Veldanda: వెల్దండ మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా తానేష్ యాదవ్ ఏకగ్రీవం
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల యాదవ సంఘం అధ్యక్షులుగా మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన తానేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు లాలు యాదవ్, కల్వకుర్తి తాలూకా యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ యాదవ్‌లు నూతనంగా ఎన్నికైన తానేష్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
అనంతరం తానేష్ యాదవ్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల యాదవ సంఘం అభివృద్ధికి, యాదవుల ఐక్యతకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.




