Nagarkurnool: మంత్రి జూపల్లి కృష్ణారావుకు సర్పంచ్ యాదమ్మ ఘన స్వాగతం!
Nagarkurnool: వెల్దండ వద్ద ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామ సమస్యలను వివరించిన సర్పంచ్ మట్ట యాదమ్మ.
Nagarkurnool: మంత్రి జూపల్లి కృష్ణారావుకు సర్పంచ్ యాదమ్మ ఘన స్వాగతం!
Nagarkurnool: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని పీవీఆర్ హోటల్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి లు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలకు గ్రామ అభివృద్ధి పనులు, సమస్యలను సర్పంచ్ వివరించారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ నాయకులు ఎండీ రషీద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పసునోజు పురుషోత్తం, కృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




