Veldanda: కొండారెడ్డిపల్లిలో సీఎంని కలిసిన వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ!

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Oct 2026 10:58 AM IST
Veldanda
X

Veldanda: కొండారెడ్డిపల్లిలో సీఎంని కలిసిన వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

దసరా పండుగ సందర్భంగా కొండారెడ్డిపల్లికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెలిప్యాడ్ వద్ద వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన, విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల సర్పంచ్ మట్ట వెంకటయ్య గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY