Veldanda: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక సమావేశం!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Nov 2026 10:38 AM IST
Veldanda
X

Veldanda: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక సమావేశం!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ నివాసంలో ఆమె అధ్యక్షతన, ఎమ్మెల్యే సూచన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కలిసి యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండలంలోని నిరుద్యోగ యువతీ, యువకులు తమకు లభిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అర్హత కలిగిన యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు మండల సర్పంచుల ఫోరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు (10వ తరగతి, ఇంటర్), ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సర్పంచుల సంఘం అధ్యక్షురాలు భాగ్యమ్మ పుల్ సింగ్, సంగీత శేఖర్ రెడ్డి, మంజుల రాజు, రోజా అరుణ్ కుమార్, శారద చెన్నయ్య, అనూష కృష్ణ, అన్వర్ పాషా, మోక్తల రమేష్, శారద సల్యా నాయక్, ఘన్య నాయక్, రమేష్ నాయక్, మౌనిక లక్షీరాం నాయక్, కేశ్య నాయక్, ప్రసాద్ గౌడ్, మమత లక్ష్మణ స్వామి, రవీందర్ నాయక్, శిరీష వెంకటేష్,

బద్రి తారసింగ్, లక్ష్మి పతి, మణిపాల్ నాయక్, నాయకులు ఎండీ రషీద్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, పురుషోత్తం, కిష్టల్, బొక్కల శ్రీనివాస్, మట్ట నిరంజన్, వెంకటేష్, మట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY