Veldanda: వెల్దండ: గణేష్ ఉత్సవాలకు రూ.51 వేల విలువైన సౌండ్ సిస్టమ్
Veldanda: వెల్దండ మండలం చల్లపల్లి గణనాథుని ఉత్సవాలకు జియాగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ రూ.51 వేల మైక్ సెట్ విరాళంగా అందజేశారు.
Veldanda: వెల్దండ: గణేష్ ఉత్సవాలకు రూ.51 వేల విలువైన సౌండ్ సిస్టమ్
వెల్దండ: బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లి గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ గణనాథుని ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ నాయకులు, జియాగూడ యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ రూ.51 వేల విలువైన మైక్ సెట్ సామగ్రిని సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. యువత, గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
మైక్ సెట్‌ను అందజేసిన జక్కుల చిన్న జంగయ్య యాదవ్‌కు గణేష్ ఉత్సవ నిర్వాహకులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మహేందర్ గోవర్ధన్ మహేష్ అల్లాజి మల్లేష్ శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




