Veldanda: దసరా ఉత్సవాలకు వెల్దండలో విస్తృత ఏర్పాట్లు: సర్పంచ్ మట్ట యాదమ్మ

Veldanda: వెల్దండలో దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య, తాగునీరు, రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 18 Oct 2026 9:49 PM IST
Veldanda
X

Veldanda: దసరా ఉత్సవాలకు వెల్దండలో విస్తృత ఏర్పాట్లు: సర్పంచ్ మట్ట యాదమ్మ

నాగర్‌కర్నూల్ జిల్లా: వెల్దండ మండల కేంద్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పురాతన నల్లాల బావి వద్ద బోరు మోటారుకు మరమ్మతులు చేయించడంతో పాటు వీధుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

మిషన్ భగీరథ పైపులైన్లకు మరమ్మతులు చేయించారు. వెల్దండ గేట్‌ నుంచి గుండాల వెళ్లే రహదారిపై గుంతలను పూడ్చించారు.బతుకమ్మ కుంటలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపించారు.

పండుగ వేళ భక్తులకు, బతుకమ్మ సంబరాల్లో పాల్గొనే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్, మసిగుండ్ల వెంకటేష్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY