Veldanda: కొట్ర గ్రామంలో లబ్ధిదారునికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
Veldanda: వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన మల్లేష్‌కు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన రూ.48 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును సర్పంచ్ శారద అందజేశారు.
Veldanda: కొట్ర గ్రామంలో లబ్ధిదారునికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన దేశమోని మల్లేష్‌కు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) రూ,48000/ రూపాయల చెక్కును గ్రామ సర్పంచ్ శంపూరి శారద చెన్నయ్య లబ్ధిదారునికి అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జెనిగల సాయి యాదవ్, శంపూరి సత్యం, కొప్పు మల్లేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జెనిగల మల్లయ్య, రాజు యాదవ్, మడ్డి కరుణాకర్, బూతుకూరి శివకృష్ణ, లక్ష్మమ్మ, రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.




