Veldanda: కుందారం తండాలో వైభవంగా గణేష్ నవరాత్రి ముగింపు వేడుకలు
Veldanda: వెల్దండ మండలం కుందారం తండాలో ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. భక్తిశ్రద్ధలతో పూజలు, ఉత్సాహంగా జరిగిన లడ్డూ వేలం పాట.
Veldanda: కుందారం తండాలో వైభవంగా గణేష్ నవరాత్రి ముగింపు వేడుకలు
వెల్దండ: వెల్దండ మండలం లోని కుందారం తండా: బంజారా యువజన సంఘం కుందారం తండా ఆధ్వర్యంలో శ్రీ వక్రతుండ వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు మహా ప్రసాదాన్ని అందజేశారు.
నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో పెద్ద లడ్డూను శ్రీ రత్లావత్ బాలు నాయక్, చిన్న లడ్డూను రత్లావత్ అరుణ్ నాయక్ దక్కించుకున్నారు. అలాగే గౌరీ సామగ్రిని పృథ్వీ రాథోడ్ దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బంజారా యువజన సంఘం కమిటీ సభ్యులు, యువత, భక్తులు పాల్గొన్నారు. కుందారం తండా యువజన సంఘం అధ్యక్షుడు సునీల్ రాథోడ్‌తో పాటు పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.




