Nagarkurnool: శంకర్ కుటుంబానికి డిప్లొమా మిత్రుల ఆర్థిక సాయం
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన దివంగత శంకర్ కుటుంబానికి డిప్లొమా మిత్రులు రూ.15,000 ఆర్థిక సాయం అందజేశారు.
Nagarkurnool: శంకర్ కుటుంబానికి డిప్లొమా మిత్రుల ఆర్థిక సాయం
నాగర్‌కర్నూల్ జిల్లా: వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండా గ్రామపంచాయతీకి చెందిన శంకర్ దాదాపు రెండేళ్ల క్రితం చనిపోయాడు. శంకర్ కుమారుడి భవిష్యత్తుకు తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో డిప్లమా మిత్రులంతా కలిసి విరాళాలు సేకరించి రూ.15,000 ఆర్థిక సహాయాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా శంకర్ మిత్రులు మాట్లాడుతూ.. శంకర్ తమ మధ్య లేకపోయినా, ఆయన కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు తెలిపారు.
కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క డిప్లొమా మిత్రుడికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.




