Veldanda: బొల్లంపల్లిలో ఘనంగా దసరా ఉత్సవాలు పూజల్లో పాల్గొన్న జంగయ్య యాదవ్
Veldanda: వెల్దండ మండలం బొల్లంపల్లిలో దసరా ఉత్సవాలు. అమ్మవారికి పూజలు చేసిన జక్కుల చిన్న జంగయ్య యాదవ్. హైదరాబాద్ కళాకారులతో కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు.
Veldanda: బొల్లంపల్లిలో ఘనంగా దసరా ఉత్సవాలు పూజల్లో పాల్గొన్న జంగయ్య యాదవ్
వెల్దండ: మండలంలోని బొల్లంపల్లి గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జియాగూడ యాదవ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బొల్లంపల్లి గ్రామానికి చెందిన జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గాదేవి కృపతో గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. విజయదశమి వేడుకలను ప్రజలంతా శాంతియుతంగా, సామరస్యపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కళాకారులు ప్రదర్శించిన కోలాటాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామస్థులను ఆకట్టుకున్నాయి. అనంతరం కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులతో పాటు పలువురిని జక్కుల చిన్న జంగయ్య యాదవ్ శాలువాలతో సన్మానించారు.
ఈ ఉత్సవాల్లో మాజీ సర్పంచ్ ఉప్పు అపర్ణ తిరుమలరావు, మండల శ్రీనివాస్ యాదవ్, సత్తూరి బాలస్వామి గౌడ్, ఆదర్శ యూత్ అధ్యక్షుడు కానుగుల వెంకటయ్య, కనకాచారి, యాదగిరి, సంజీవ్ రావు, కమిటీ సభ్యులు శ్రీహరి, మల్లేష్, వెంకటేష్, లక్ష్మయ్య, సాయి, రమేష్, జంగయ్య, మల్లేష్, నిరంజన్, లింగం, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




