Veldanda: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: గోలి శ్రీనివాస్!
Veldanda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వెల్దండలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
Veldanda: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: గోలి శ్రీనివాస్!
వెల్దండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట రాoరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పట్టభద్రులను గుర్తించి, ఫారం-6 ద్వారా ఓటర్లుగా నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోలి శ్రీనివాసరెడ్డి అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ జంగిలి నిరంజన్ అంజయ్య జంగిలీ ఆనంద్ దేవేందర్ శేఖర్ ప్రసాద్ అంజి మాస్టర్ దన్ సింగ్ హేమ్జా నాయక్ సత్యం తో పాటు తదితరులు ఉన్నారు.




