Lingareddypally: దుర్గమ్మ సేవలో అంజి మాస్టర్.. భక్తులకు ఘనంగా అన్నదానం
Lingareddypally: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం లింగరెడ్డిపల్లిలో దేవీ నవరాత్రుల సందర్భంగా అంజి మాస్టర్ ఆధ్వర్యంలో భక్తులకు ఘనంగా అన్నదానం నిర్వహించారు.
Lingareddypally: దుర్గమ్మ సేవలో అంజి మాస్టర్.. భక్తులకు ఘనంగా అన్నదానం
Lingareddypally: దేవీ నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని వెల్దండ మండలం లింగరెడ్డిపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంజి మాస్టర్ దుర్గామాత పూజలో పాల్గొని, భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దుర్గామాత ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లింగరెడ్డిపల్లి సర్పంచ్ అన్వర్ పాషా, ఉపసర్పంచ్ లింగమయ్య, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలతో పాటు పోతేపల్లి గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు. భక్తి భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది.




