Vatwarlapally: వటవర్లపల్లి పునరావాసంపై మాజీ సర్పంచ్ ధ్వజం
Vatwarlapally: వటవర్లపల్లిలో స్వచ్ఛంద పునరావాసం పేరిట అటవీ శాఖ, కమిటీ సభ్యులు బలవంతపు సంతకాల సేకరణ చేపడుతున్నారని మాజీ సర్పంచ్ ఛత్ర నాయక్ మండిపడ్డారు.
Vatwarlapally: వటవర్లపల్లి పునరావాసంపై మాజీ సర్పంచ్ ధ్వజం
Vatwarlapally: అటవీ శాఖ వారు పునరావాసం పేరుతో మా వటవర్లపల్లి గ్రామంలోని కొంతమంది వ్యక్తులతో కలిసి స్వచ్ఛంద పునరావాసం పేరుతో గ్రామాలను తరలించే ప్రక్రియ జరుగుతు ఈనెల 18వ తారీఖున బాండ్ పేపర్ పైన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అటవీశాఖ వారు కొంతమంది ప్రజల అభిప్రాయాలు మేరకు గ్రామాన్ని తరలించే కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ నివసించే ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని గతంలో చాలా సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారిని ఈ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలపై వచ్చిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్ర మార్క్ గారికి, గిరిజన శాఖ మంత్రివర్యులు అట్లూరి లక్ష్మణ్ కు , పంచాయతీరాజ్ శాఖ మాత్యులు సీతక్కకు , స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు మరియు ఎన్నో సందర్భాల్లో జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది.
మా గ్రామానికి చెందిన కొంతమంది స్వచ్ఛంద పునరావాసం పేరుతో బాండ్ల ప్రక్రియను మేము వెళ్తాము కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా మొదటి రోజు 237 మంది మాత్రమే సంతకాలు చేయడం జరిగింది. రెండో రోజు కొంతమంది వారి బంధువులు బంధుమిత్రులతో బలవంతంగా 60 మంది పెట్టడం జరిగింది.
ఆ తర్వాత నిన్న అధికారుల ప్రోత్బలంతోని కొంతమంది కమిటీ సభ్యులు గ్రామంలో నివసించే వారికి బెదిరింపులకు దిగి రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో పులులు జంతువులతో ఇబ్బందితో పాటు సరియైన విద్యుత్ సరఫరా నీటి సరఫరా ఎలాంటి వసతులు లేకుండా చేస్తామని బెదిరించి గ్రామంలో నివసించే వారికి ఇంకొంతమంది గ్రామాన్ని విడిచి వెళ్లి ఎక్కడో నివసిస్తున్న వారిని కూడా పిలిపించుకొని వారి చాలా రోజులుగా గ్రామానికి సంబంధం లేని వ్యక్తులతో వారి యొక్క సంఖ్యాబలాన్ని చూపడం కోసం సంతకాల సేకరణ కార్యక్రమం బలవంతంగా చేపడుతున్నారు.
ఇది ముమ్మాటికి పారదర్శకంగా జరగడంలేదని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ కార్యక్రమం పై త్వరలో జిల్లా కలెక్టర్కు స్థానిక ఎమ్మెల్యేకూ ఈ తప్పుడు సంతకాల సేకరణ వలన వందల సంవత్సరాలుగా ఏర్పడి ఉన్న గ్రామం అభివృద్ధిని అడ్డుకునే చర్యగా మేము భావిస్తున్నాం ప్రపంచంతో పోటీపడే స్థాయికి మా గ్రామం అభివృద్ధి చెందుతున్న సమయంలో మా గ్రామం ఈ ప్రజా ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, పాఠశాల నూతన భవనాల నిర్మాణం , కాంపౌండ్ వాల్ మంచినీటి ట్యాంకులు పైపులైన్లు,వంటి కార్యక్రమాలు మా గ్రామంలో జరగాలి.
మా అందరినీ అభివృద్ధి చేయాలి తప్పుడు సమాచారం అందజేసి ప్రభుత్వాన్ని అటవీ శాఖ వారిని తప్పుదోవ పట్టిస్తున్న పారదర్శకతలేని పునరావాస కమిటీపై చర్యలు తీసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు భరత్, రమేష్, సల్వాది గోపాల్, అఖిల్, శివప్రసాద్ ,రాజేందర్ ,రాజు రాజశేఖర్, శివ విశ్వనాథ శ్రీను గ్రామ యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.




