Amrabad: సమస్యల వలయంలో వట్టెవర్లపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల!
Amrabad: అమ్రాబాద్ మండలం వట్టెవర్లపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, కుళ్లిన అరటిపండ్లు, పెరుగు బంద్పై ప్రిన్సిపల్ లింగయ్యపై చర్యలు తీసుకోవాలని శివ నాయక్ డిమాండ్ చేశారు.
Amrabad: సమస్యల వలయంలో వట్టెవర్లపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల!
అచ్చంపేట / అమ్రాబాద్: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్టెవర్లపల్లి గ్రామంలోని ఉపాధ్యాయుల కొరత. సరైన బాత్రూం లు లేక అడవి బాటన గిరిజన విద్యార్థులు . కుళ్లిన పండ్ల పంపిణీ.. ఫ్యాన్లు లేని తరగతి గదులు! ఉదయం అల్పాహారం బంద్ పెరుగు బంద్ చేసిన ప్రిన్సిపల్ లింగయ్య పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు చెలగాటమాడుతున్నారా? తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసిన శివ నాయక్. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పాఠశాలలో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విద్యార్థులతో కలిసి మాట్లాడిన శివ నాయక్. సమయానికి ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకాకపోవడం వల్ల విద్యార్థుల విలువైన విద్యా ఇంగ్లీష్ గణితం బయాలజీ సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక సంవత్సరం గడుస్తున్న పదవ తరగతి విద్యార్థుల జీవిత మందాకారంలో పెడుతున్న నాగర్ కర్నూలు జిల్లా యంత్రాంగం సమయం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది.
కుళ్లిన అరటిపండ్ల పంపిణీ.. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం!
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా, మెనూ అమలులో నిర్లక్ష్యం జరుగుతోందని, విద్యార్థులకు కుళ్లిపోయిన అరటిపండ్లు పంపిణీ చేస్తున్నారూ విద్యార్థులకు అందించే ఆహార నెలరోజుల నుంచి పెరుగు బంద్ చేసిన ప్రిన్సిపాల్ లింగయ్య నాణ్యతపై సంబంధిత అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ఫ్యాన్లు లేని తరగతి గదులు.. సిగరెట్ డబ్బాలు దర్శనం!
తరగతి గదుల్లో కనీస సౌకర్యాలైన ఫ్యాన్లు కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా తరగతి గదుల్లో సిగరెట్ డబ్బాలు కనిపించడం పాఠశాల నిర్వహణపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. విద్యార్థులు చదువుకోవాల్సిన తరగతి గదుల్లో ఇలాంటి వస్తువులు కనిపించడం ఆందోళనకరం. ఈ కార్యక్రమంలో TGVP రవి యాదవ్ ఆంగోత్ శివ నాయక్ స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు




