Makthal: బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డిని కలిసిన వాల్మీకి సోదరులు, స్థానిక నాయకులు!
Makthal: నర్వ మండలంలో వాల్మీకి భవన నిర్మాణానికి స్థలం ఇచ్చిన మక్తల్ ఎంఎల్సి ఇంచార్జ్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డిని కలిసిన వాల్మీకి సోదరులు. జయంతికి ఆహ్వానం.
Makthal: బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డిని కలిసిన వాల్మీకి సోదరులు, స్థానిక నాయకులు!
Makthal: నర్వ మండలకేంద్రానికి చెందిన వాల్మీకి సోదరుల కోరికమేరకు గతంలో వాల్మీకి భవన నిర్మాణానికి కావాల్సిన 200 గజాల స్థలాన్ని దానంగా ఇచ్చిన మక్తల్ నియోజకవర్గ MLC ఇంచార్జ్ డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారిని తన ఫార్మ్ హౌస్ దగ్గరికెళ్లి కలిసి ఈనెల 26వ తారీకున జరిగే వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొని,వాల్మీకి భవన నిర్మాణానికి భూమి పూజ చేయాలని కోరారు.
సానుకూలంగా స్పందించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆదర్శమూర్తి అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి జీవిత చరిత్రను లోకానికి చాటిచెప్పిన శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ, తప్పక హాజరవుతానని తెలియజేసారు.
ఇట్టి కార్యక్రమంలో నర్వ మాజీ ఉపసర్పంచ్ శ్రీ చింతచెట్టు రాములు గారు, 2 వ వార్డు మెంబర్ శ్రీ కోట్ల వెంకటన్న గారు, మాజీ వార్డు మెంబర్లు శ్రీ గంగామోళ్ళ నర్సిమ్మ గారు, శ్రీ డొంగుల చెంద్రప్ప గారు,శ్రీ కోట్ల పాపన్న గారు,బీజేపీ భూత్ అద్యక్షులు శ్రీ బండి అయ్యలు గారు మరియు వాల్మీకి రాజు,రాములు, గంగులు,నర్సిమ్మ పాల్గొన్నారు.




