Makthal: రూ. 4 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన వాకిటి శేషగిరి!

Makthal: కృష్ణ మండలంలో అయీనాపూర్ నుంచి సుగూర్ లింగంపల్లి వరకు రూ. 4 కోట్లతో 4 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్డు పనులను మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి ప్రారంభించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 24 Nov 2026 1:35 PM IST
Makthal
X

Makthal: రూ. 4 కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన వాకిటి శేషగిరి!

Makthal: అయీనాపూర్ గ్రామం నుండి సుగూర్ లింగంపల్లి గ్రామం వరకు రూ. 4 కోట్లతో 4 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి

మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న రహదారి సమస్యకు పరిష్కారం చూపుతూ, రూ. 4 కోట్ల భారీ నిధులతో అయీనాపూర్ గ్రామం నుండి సుగూర్ లింగంపల్లి గ్రామం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఆర్ అండ్ బీ (R&B) రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది.

గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు, గిరి అన్న గారు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ గౌడ గారి ఆధ్వర్యంలో ఈ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు సరైన రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు నేడు పరిష్కారం లభించడం ఎంతో సంతోషకరమైన విషయం.

ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడి ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అయీనాపూర్ సర్పంచ్ శరణ్య స్వామి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయ గౌడ గారు, ఉపాధ్యక్షులు నారాయణ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ రెడ్డి, కృష్ణ మండల ఉపాధ్యక్షులు బాగ్లి మహేష్ గారితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన రహదారి నిర్మాణానికి స్పందించి, రూ. 4 కోట్ల నిధులు మంజూరు చేయించి పనుల ప్రారంభానికి కృషి చేసిన మన ప్రియతమ నాయకులు, గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL