Makthal: మక్తల్ నియోజకవర్గ బతుకమ్మ కమిటీ ఛైర్పర్సన్గా వాకిటి లలిత ఏకగ్రీవ ఎన్నిక!
Makthal:మక్తల్ నియోజకవర్గ బతుకమ్మ కమిటీ ఛైర్పర్సన్గా మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Makthal: మక్తల్ నియోజకవర్గ బతుకమ్మ కమిటీ ఛైర్పర్సన్గా వాకిటి లలిత ఏకగ్రీవ ఎన్నిక!
Makthal: మక్తల్ నియోజకవర్గం బతుకమ్మ కమిటీ చైర్పర్సన్ గా వాకిటి లలిత ( మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి)ఎన్నిక మహిళా సంఘాల సభ్యుల పిడి వెంకట్రాములు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వాకిటి లలిత ను మంత్రి వాకిటి శ్రీహరి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వాకిటి లలిత మాట్లాడుతూ బతుకమ్మ కమిటీ చైర్పర్సన్ గా తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
నియోజవర్గ మహిళలు బతుకమ్మ కమిటీ చైర్పర్సన్ గా తనపై పెద్ద బాధ్యతను ఉంచారని, వచ్చే ఏడాది మరింత ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు . బతుకమ్మ సంబరాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ప్రతి పల్లె పల్లెనా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మక్తల్ పట్టణంలో మాత్రం పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఇది రెండోసారి అని గుర్తు చేశారు. బతుకమ్మ పండగకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




