Nagarkurnool: పేదింటి విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం!

Nagarkurnool: వెల్దండ మండలం చౌదర్‌పల్లికి చెందిన మెడిసిన్ విద్యార్థిని సిరికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Sept 2026 5:48 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: పేదింటి విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం!

Nagarkurnool: పేదింటి ఆడబిడ్డ ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆర్థిక సహాయం అందించారు.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన సిరి మెడిసిన్ చదువుకుంటోంది.

అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తన చదువుకు సహాయం చేయాలని ఉప్పల వెంకటేష్‌ను కోరింది. స్పందించిన ఆయన రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని సిరి కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చౌదర్‌పల్లి గ్రామ ఉపసర్పంచ్ రాజీవ్, వార్డు సభ్యుడు భారత్, ఉప్పల వెంకటేష్ ముఖ్య అనుచరుడు కేతావత్ సాయికుమార్, గ్రామ యువ నాయకులు మల్లేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY