Kalwakurthy: భగత్‌సింగ్ తండా విద్యార్థి చరణ్ తేజ నాయక్‌కు సత్కారం!

Kalwakurthy: కల్వకుర్తి మండలం భగత్‌సింగ్ తండాకు చెందిన చరణ్ తేజ నాయక్ ఎంబీబీఎస్ సీటు సాధించగా, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అభినందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 5 Oct 2026 8:57 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: భగత్‌సింగ్ తండా విద్యార్థి చరణ్ తేజ నాయక్‌కు సత్కారం!

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని భగత్‌సింగ్‌ తండాకు చెందిన గోపాల్‌ నాయక్‌ కుమారుడు చరణ్‌ తేజ నాయక్‌ గిరిజన తండాలో పుట్టి కష్టపడి చదివి ఎంబీబీఎస్‌ సీటు సాధించడం పట్ల రాష్ట్ర మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేష్‌ అభినందించారు.

ఈ సందర్భంగా చరణ్‌ తేజ నాయక్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విద్యాభ్యాసం కొనసాగించేందుకు తనవంతు సహకారం అందిస్తానని చరణ్‌ తేజ కుటుంబ సభ్యులకు ఉప్పల వెంకటేష్‌ భరోసా ఇచ్చారు. పేద, గిరిజన కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండ్ర మాజీ సర్పంచ్‌ సుశీల ఈశ్వరయ్య, మల్లీశ్వరి, గోపాల్‌ నాయక్‌, రాములు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY