Veldanda: నిరుపేద కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత!
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో సొంతింటి నిర్మాణం కోసం బొక్కల నరసింహ కుటుంబానికి సిమెంట్‌ను అందజేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్.
Veldanda: నిరుపేద కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత!
Veldanda: నాగర్ కర్నూల్ వెల్దండ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబ సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. జిల్లా వెల్దండ మండలానికి చెందిన బొక్కల నరసింహ, తండ్రి రాములు ఇంటి నిర్మాణం ఫినిషింగ్ పనులకు అవసరమైన సిమెంట్‌ను తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అందజేశారు.
ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు సొంతింటి నిర్మాణంలో తనవంతు సహకారం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీ చలిచీమల జ్యోతి నిరంజన్, బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొమ్ము నాగయ్య, బాదేపల్లి గోపాల్ కుమార్, ముదిరాజ్ జంగిలి దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.




