Nagarkurnool: మర్రిగుంత తాండాలో మృతుడి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సాయం!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం మర్రిగుంత తాండాలో మృతిచెందిన దేవా నాయక్ కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Oct 2026 11:37 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: మర్రిగుంత తాండాలో మృతుడి కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సాయం!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం మర్రిగుంత తాండ కొత్త తాండ గ్రామానికి చెందిన ఇస్లావత్ దేవా నాయక్ నిన్న రాత్రి మృతి చెందడం జరిగింది.

ఉప్పల వెంకటేష్ ముఖ్య అనుచరుడు ఇస్లావత్ విజేష్ నాయక్ ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి 3000(మూడు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్,ఇస్లావత్ విజేష్ నాయక్, ఇస్లావత్ దేవుజా నాయక్,కిషన్ నాయక్, తారసింగ్, సక్రు నాయక్,సునీల్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY