Veldanda: వెల్దండ మోడల్ స్కూల్‌లో మార్షల్ ఆర్ట్స్ పోటీల ప్రారంభం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మోడల్ స్కూల్‌లో అండర్-14, అండర్-16 మార్షల్ ఆర్ట్స్ పోటీలను సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్ ఘనంగా ప్రారంభించారు.
Veldanda: వెల్దండ మోడల్ స్కూల్‌లో మార్షల్ ఆర్ట్స్ పోటీల ప్రారంభం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లావెల్దండ: మండల కేంద్రంలోని వెల్దండ మోడల్ స్కూల్‌లో అండర్-14, అండర్-16 మార్షల్ ఆర్ట్స్ పోటీలను సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. మార్షల్ ఆర్ట్స్ సాధనతో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించుకోవడంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం అలవడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ చందు, జంగిలి వంశీ, కిషోర్, సింధు, పీఈటీలు జాన్, మమత, వార్డు సభ్యులు వెంకటేష్, శ్రీను, తిరుపతిరెడ్డి, రవీందర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.




