Achampet: సీఎం పర్యటన వేళ ముందస్తు అరెస్టులు.. ప్రశ్నించే గొంతుకలను ఆపలేరు!
Achampet: సీఎం పర్యటన నేపథ్యంలో తనను ముందస్తుగా అరెస్టు చేయడంపై టీఆర్పీ అచ్చంపేట ఇంచార్జ్ డా. నారమోని నరేష్ యాదవ్ ఆగ్రహం. ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని వ్యాఖ్య.
Achampet: సీఎం పర్యటన వేళ ముందస్తు అరెస్టులు.. ప్రశ్నించే గొంతుకలను ఆపలేరు!
Achampet: అచ్చంపేట నియోజకవర్గ కేంద్రానికి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని ముందస్తుగా అరెస్టు చేసి అచ్చంపేట సర్కిల్ కు తీసుకురావడం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డా. నారమోని నరేష్ యాదవ్ తెలిపారు.
ఈ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ప్రజా గొంతుకలై ప్రతినిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.
వాస్తవానికి ఈరోజు తనకు మహబూబ్ నగర్ కోర్టులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు హియరింగ్ ఉందని, తనను పంపించాలని కావాల్సిన పేపర్లు చూపించినా వినకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగిందని ఆరోపించారు.
డా. నారమోని నరేష్ యాదవ్ - టీఆర్పీ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జ్.




