Achampet: అచ్చంపేటలో అటవీ అగ్నిప్రమాదాల నివారణపై సిబ్బందికి శిక్షణ!
Achampet: అచ్చంపేటలో అటవీ అగ్నిప్రమాదాల నివారణపై శిక్షణ కార్యక్రమం. దూలపల్లి అటవీ అకాడమీ ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన, శిక్షణ ఇచ్చిన నిపుణులు.
Achampet: అచ్చంపేటలో అటవీ అగ్నిప్రమాదాల నివారణపై సిబ్బందికి శిక్షణ!
Achampet: అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, నియంత్రణ చర్యలపై అటవీ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని జీటీడీ చౌశింగ హాల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ – CEFNARM, దూలపల్లి, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అకాడమీ కోర్సు డైరెక్టర్ శ్రీ కే. శ్రీనివాసులు, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీ సీహెచ్. గంగారెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీ జి. రవికాంత్ పాల్గొన్నారు.
అటవీ శాఖ తరఫున అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ యశ్ చంద్ర ప్రకాష్ సింఘాల్, IFS, అచ్చంపేట అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ACF) శ్రీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి ATR సర్కిల్ పరిధిలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (FROలు), డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు (Dy. ROs), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు (FSOs), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (FBOలు), బేస్ క్యాంప్ సిబ్బంది, యానిమల్ ట్రాకర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, మంటలు వ్యాపించకుండా నియంత్రించే పద్ధతులు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై శిక్షణ అందించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో అగ్ని ప్రమాదాల నియంత్రణ ప్రాధాన్యతను వివరించారు.
క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించి, అటవీ అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా నివారించడం, నియంత్రించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు.




