Gadwal: గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని యువకుడు మృతి!
Gadwal: గద్వాల పట్టణంలోని నదీ అగ్రహారం రహదారిపై బుధవారం బైక్ అదుపుతప్పి చింతచెట్టును ఢీకొన్న ప్రమాదంలో చెన్నుగోనిపల్లి యువకుడు సుధాకర్ మృతి చెందాడు.
Gadwal: గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని యువకుడు మృతి!
గద్వాల: పట్టణంలోని నదీ అగ్రహారం వెళ్లే రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతుడిని చెన్నుగోనిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.




