Balmoor: బల్మూరులో విషాదం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Balmoor: నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరులో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపుల కారణంగా సైదులు అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Updated on: 25 Oct 2026 8:53 PM IST
Balmoor
X

Balmoor: బల్మూరులో విషాదం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

నాగర్ కర్నూల్ జిల్లా: బల్మూరు మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బల్మురు ఎస్ ఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం బల్మూరు మండల కేంద్రానికి చెందిన సైదులు అనే వ్యక్తికి ఇటీవల తన భార్యతో కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి.

నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. దసరా పండుగ కు భార్య ను పుట్టింటికి వెళ్లకుండా నిత్యం వేధింపులకు గురిచేసేవాడని అత్తారింటి వారు వేధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఫోన్ చేసి హెచ్చరిక లు జారీ చేయడం తో ఆందోళన కు గురై ఆత్మ హత్య కు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ క్రమం ఇదే విషయం పై శనివారం రాత్రి భార్యతో మరోసారి గొడవపడిన సైదులు, ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. తెల్లవారే వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా పడి ఉన్నాడు.

స్థానికులు వెంటనే బల్మూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్ మార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బల్మురు ఎస్ ఐ రాజేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చిన్న చిన్న కుటుంబ కలహాలకే ఆత్మహత్య వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, ఏవైనా సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.పోస్ట్ మార్టం అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA