Dharmapur: ధర్మాపూర్‌లో నరసింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మిథున్ రెడ్డి

Dharmapur: మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో సీనియర్ కాంగ్రెస్ నేత నరసింహారెడ్డి మాతృమూర్తి పార్వతమ్మ చిత్రపటానికి టీపీసీసీ నేత ఏపి మిథున్ రెడ్డి నివాళులర్పించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 8 Oct 2026 8:53 PM IST
Dharmapur
X

Dharmapur: ధర్మాపూర్‌లో నరసింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మిథున్ రెడ్డి

Dharmapur: మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి పార్వతమ్మ గారు ఇటీవల పరమపదించిన విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి గారు ధర్మాపూర్‌లోని వారి నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా పార్వతమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించి,నరసింహారెడ్డి గారిని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పార్వతమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ధర్మాపూర్ సర్పంచ్ రాజు గౌడ్,శ్రీనివాస్ రెడ్డి,తిరుపతి నాయక్ తదితరులు ఉన్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.