Wanaparthy: వనపర్తి ఎస్పీ సునిత రెడ్డిని కలిసిన ప్రొబేషనరీ డీఎస్పీలు!
Wanaparthy: వనపర్తి జిల్లాలో ఆరు నెలల క్షేత్రస్థాయి శిక్షణకు వచ్చిన ముగ్గురు ప్రొబేషనరీ డీఎస్పీలు జిల్లా ఎస్పీ సునిత రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Wanaparthy: వనపర్తి ఎస్పీ సునిత రెడ్డిని కలిసిన ప్రొబేషనరీ డీఎస్పీలు!
వనపర్తి: వనపర్తి జిల్లాలో ఆరు నెలల క్షేత్రస్థాయి శిక్షణ కోసం కేటాయించబడిన ముగ్గురు ప్రొబేషనరీ డీఎస్పీలు * చింత రాహుల్, శ్రీ పాపినేని అఖిల్, శ్రీ శివరాజ్ పబ్బా* జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు శిక్షణార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ, పోలీసు విధుల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునేలా ప్రాయోగిక శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వివిధ పోలీసు విధులు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు స్టేషన్ నిర్వహణ తదితర అంశాల్లో ప్రత్యక్ష అనుభవం పొందాలని తెలిపారు.
శిక్షణ కాలంలో శిక్షణార్థుల పనితీరు, పురోగతిని జిల్లా ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షిస్తారు, అధికారులు శిక్షణార్థులకు తగిన మార్గదర్శకత్వం అందిస్తూ, ప్రతి అంశంలో ప్రత్యక్షంగా పాల్గొని నేర్చుకునేలా ప్రాక్టికల్ శిక్షణ కల్పించాలని ఆదేశించారు. శిక్షణను కేవలం పరిశీలనకే పరిమితం చేయకుండా, విధుల నిర్వహణలో స్వయంగా పాల్గోన్నాలని సూచించారు.
దాదాపు 24 వారాల పాటు కొనసాగే ఈ ఆరు నెలల శిక్షణ కాలంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు నిరంతర పర్యవేక్షణ, మూల్యాంకనం చేపట్టి, శిక్షణార్థుల వృత్తిపరమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విధి నిర్వహణ సామర్థ్యం పెంపొందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని జిల్లా ఎస్పీ తెలిపారు.




