Kalwakurthy: కల్వకుర్తి నియోజకవర్గంలో పేదలకు ఊరట.. వేలాది మందికి కొత్త పింఛన్లు!
Kalwakurthy: కల్వకుర్తి నియోజకవర్గంలో వేలాది మంది పేదలకు కొత్త చేయూత పింఛన్లు మంజూరు కావడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Kalwakurthy: కల్వకుర్తి నియోజకవర్గంలో పేదలకు ఊరట.. వేలాది మందికి కొత్త పింఛన్లు!
Kalwakurthy: పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం నూతన చేయూత పింఛన్లు మంజూరు చేయడంపై కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయంతో అర్హులైన వేలాది మంది పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరట లభించనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోనే పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు.
సమాజంలోని నిరుపేద, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. అర్హత ఉండి ఇప్పటివరకు పింఛన్ పొందని వారు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రజా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




