Wanaparthy: నవంబర్ 26న వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ పర్యటన!

Wanaparthy: నవంబర్ 26న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు వనపర్తి జిల్లాలో పర్యటించి రేషన్ షాపులు, పాఠశాలలను తనిఖీ చేయనున్నారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 23 Nov 2026 7:13 PM IST
Wanaparthy
X

Wanaparthy: నవంబర్ 26న వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ పర్యటన!

Wanaparthy: నవంబర్ 26 తేదీన తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిషన్ సభ్యులతో కలిసి వనపర్తి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

నవంబర్ 26 గురువారం నాడు కమిషన్ సభ్యులు ఉదయాన్నే 9:30 కు వనపర్తి పట్టణం చేరుకొని రేషన్ షాపులు, పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించి ఆహార నాణ్యత ప్రమాణాలు హెల్త్ కిట్, మెటీర్నిటీ బెనిఫిట్ లను తనిఖీ చేయనున్నట్లు తెలియజేసారు.

జిల్లాలో ఆయా సెంటర్లలో పర్యటించిన అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు సంబంధిత అధికారులతో ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తో పాటు కమిషన్ సభ్యులు వి ఆనంద్ గోవర్ధన్ రెడ్డి ఆర్ శారద ఎం భారతి బి జ్యోతి బానోత్ సంగులాల్ పర్యటనలో పాల్గొననున్నట్లు తెలిపారు

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY