Mahabubnagar: కేసీఆర్ తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆగమైంది: శ్రీనివాస్ గౌడ్!

Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో ఆదివారం జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Published on: 29 Nov 2026 7:09 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: కేసీఆర్ తెచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆగమైంది: శ్రీనివాస్ గౌడ్!

మహబూబ్ నగర్: కెసిఆర్ కష్టపడి తెచ్చిన తెలంగాణ మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆగమయ్యిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతులకు కరెంటు లేదు.. సాగు నీరు లేదు.. పాలమూరు నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు పోయినా పెట్టించుకునే నాథుడే లడని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కెసిఆర్ నాయకత్వం లో ప్రత్యేక ప్రత్యేక తెలంగాణ పోరాటం సాగిందని, పదవులను త్యాగం చేసి కెసిఆర్ దీక్ష కు కదిలారని, కేసీఆర్ పోరాటం తో న తెలంగాణ ఏర్పాటయిందని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యువతకు ఉద్యోగాలు లేవు... కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితులు టాలెత్తయ్యని విమర్శించారు.

కెసిఆర్ తిరిగి ముఖ్యమంత్రి చేసుకొని తెలంగాణ ను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దామని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు తీసుకెళ్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని శ్రీనివాస్ గౌడ్, ఆరోపించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.