Narayanpet: డిసెంబర్ 7 నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2026

Narayanpet: భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026 జరగనుందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 29 Nov 2026 4:48 PM IST
Narayanpet
X

Narayanpet: డిసెంబర్ 7 నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2026

నారాయణపేట: నారాయణపేట జిల్లా... తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా, సాంకేతిక ఆవిష్కరణలకు అంతర్జాతీయ వేదికగా నిలిపే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026కి సర్వం సిద్ధమైందని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో మూడు రోజుల పాటు ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

'రైజింగ్ టుగెదర్' నినాదంతో ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ పారిశ్రామిక, ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పనున్నారు. ప్రపంచ స్థాయి పెట్టు బడులను ఆకర్షించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడం, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి కొత్త దిశానిర్దేశం చేయడం ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ సమ్మిట్లో రక్షా దేశంలో ఎక్స్‌పో-2026, చేంజ్ కానేవ్, స్టార్టప్ షోకేస్, ఎడ్యుకేషన్ ఇండియా జాయ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రక్షణ, పర్యావరణం, విద్య, స్టార్టప్‌లు, వినోదం, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, అవకాశాలను ఈ వేదికపై ప్రదర్శిస్తారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల హబ్గా, వ్యాక్సిన్ ఉత్పత్తిలో కీలకంగా, ఏరోస్పేస్, అధునాతన తయారీ రంగాలకు ప్రధాన గమ్యస్థానంగా అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేయనున్నారు.

సెమీకండక్టర్లు, డ్రోన్లు, జెట్ ఇంజిన్లు, విమాన విడిభాగాల తయారీ, అంతరిక్ష పరిశోధన, సముద్ర నిఘా. సరిహద్దు భద్రత వంటి అత్యాధునికాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా రంగస్థలం ప్రదర్శిస్తుంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం, స్కెరూట్ సంస్థ రూపొందించిన విక్రమ్ రాకెట్, రక్షణ రంగానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏరోస్పేస్ తయారీ రంగంలో పెట్టుబడి అవకాశాలు ఈ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పారిశ్రామిక, సాంకేతిక ప్రగతితో పాటు తెలంగాణ ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి కూడా ఈ సమ్మిట్లో విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశోధన, అభివృద్ధి.

ఆవిష్కరణలకు ఉన్న అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు వివరించేందుకు ఈ సమ్మిట్ కీలక వేదిక. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి అంతర్జాతీయంగా అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2026 ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. 'రైజింగ్ టుగెదర్' స్ఫూర్తితో రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త అవకాశాలు తెరవనుంది.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA