Makthal: ఖేలో ఇండియా శిక్షణలో తెలంగాణ జట్టు రాణించాలి: మంత్రి వాకిటి శ్రీహరి

Makthal: మక్తల్‌లో ఖేలో ఇండియా ఖో-ఖో, ధన్వాడ కేజీబీవీలో 33 జిల్లాల బాలికల రెజ్లింగ్ శిక్షణ శిబిరాలను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రారంభించారు.

B. NARENDER, MAKTHAL
Updated on: 2 Nov 2026 8:24 PM IST
Makthal
X

Makthal: ఖేలో ఇండియా శిక్షణలో తెలంగాణ జట్టు రాణించాలి: మంత్రి వాకిటి శ్రీహరి

నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు ఖేలో ఇండియా ఖో ఖో శిక్షణ శిబిరాన్ని మక్తల్ పట్టణంలో క్రీడా మైదానంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల్ మినీ మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హనుమంతు గారు 16వ వార్డు కౌన్సిలర్ పావని గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఏ రవికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ డి గణేష్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్, కోళ్ల వెంకటేష్, కౌన్సిలర్ రహీం పటేల్, నీలప్ప ముదిరాజ్, నీలా గౌడ్, ఆర్ఎంపి శంకర్, ఏఎంసీ డైరెక్టర్ ఫయాజ్, మంజూరు ఇలాహి, డివోఎస్ఓ వెంకటశెట్టి, వివిధ పాఠశాల కోచ్ లు పాల్గొన్నారు.

ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఖో-ఖో శిక్షణ శిబిరంలో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి (DYSO) వెంకటేష్ శెట్టి ఆకాంక్షించారు.క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు, జాతీయ స్థాయిలో కూడా రాణించాలని తెలిపారు.

క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు క్రీడా శాఖ కృషి చేస్తోందని పేర్కొన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని DYSO వెంకటేష్ శెట్టి పిలుపునిచ్చారు.

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని కేజీబీవీ ధన్వాడలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెజ్లింగ్ కోచింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి బాలికా రెజ్లింగ్ క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ధన్వాడ సర్పంచ్ పంది రామచంద్రయ్య, ఎమ్మెల్యే పీఏ మాధవ్ రెడ్డి, నారాయణపేట మార్కెటింగ్ చైర్మన్ సదాశివ రెడ్డి గారు, జిల్లా నాయకులు గాజుల శివకుమార్ , మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, ధన్వాడ గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

అలాగే నారాయణపేట జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింలు, కేజీబీవీ ధన్వాడ స్పెషల్ ఆఫీసర్ (SO), పీడీలు సాయినాథ్, అనంతసేన, వెంకటప్ప, కేజీబీవీ ధన్వాడ పీఈటీ సౌమ్య, రెజ్లింగ్ కోచ్ పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL