Achampet: అచ్చంపేటలో పెరిగిన ఛాయ్ ధరలపై వ్యతిరేకత!

Achampet: అచ్చంపేటలో అకస్మాత్తుగా పెరిగిన ఛాయ్ ధరలు. పాల ధరలు పెరగకపోయినా ఒక్కసారిగా రూ.5 పెంచడంపై మండిపడుతున్న ఛాయ్ ప్రియులు, సామాన్యులు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Updated on: 23 Oct 2026 3:08 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేటలో పెరిగిన ఛాయ్ ధరలపై వ్యతిరేకత!

Achampet: అచ్చంపేట పట్టణంలోని టీ సెంటర్లలో ఛాయ్ ధరలు పెంచడంపై ఛాయ్ ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై ఈ పెంపు అదనపు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల ధరలు పెరిగినప్పుడు ఛాయ్ ధరలు పెంచితే సమంజసమేనని, పాల ధరల్లో మార్పు లేకుండానే ధరలు ఒకేసారి ఐదు రూపాయలు పెంచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. చాయ్ రేటు తగ్గించకపోతే చాయ్ తాగిన ప్రతి ఒక్కరు పాత రేటు ఇయ్యాలని డిమాండ్ చేస్తున్న చాయ్ ప్రియులు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA