Nagarkurnool: బాధిత కుటుంబానికి అండగా సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా చౌదర్‌పల్లిలో మృతి చెందిన దుబ్బల బాలయ్య కుటుంబానికి సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి రూ. 5,000 తక్షణ సాయం అందించి అండగా నిలిచారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Oct 2026 10:20 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: బాధిత కుటుంబానికి అండగా సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి!

Nagarkurnool: వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన దుబ్బల బాలయ్య మృతి చెందారు. బాలయ్య మృతి విషయం తెలుసుకున్న సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబానికి కొంత ఊరట కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దొబ్బల రాజీవ్, కావట్టి మోహన్, చిట్టిల మల్లయ్య, లోడిగా తిరుపతయ్య, ఎనుముల సాయికుమార్, కొప్పు భరత్, దుబ్బ రామచంద్రి, ఒగ్గు బాలరాజ్, దొబ్బల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY