Achampet: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై ఇందిర
Achampet: అచ్చంపేట సాయి నగర్ జడ్పీ హైస్కూల్లో నాగర్కర్నూల్ జిల్లా షీ టీం ఇన్చార్జ్ ఎస్సై ఇందిర ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.
Achampet: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై ఇందిర
: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా షీ టీం ఇన్చార్జి ఎస్ఐ ఇందిర అన్నారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఇందిరా మాట్లాడుతూ విద్యార్థులు బాల్య దశ నుండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం వల్ల జీవితాలను నాశనం అవుతాయని అన్నారు.
మైనర్లు వాహనాలు నడపవద్దని మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల దినచర్య పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థినిలకు ఎవరైనా ఇబ్బందులకు గురిచేసిన అట్టివారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తుందన్నారు. విద్యార్థులు సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో షీ టీం డివిజన్ ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ పద్మ, మల్లేష్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




