Gadwal: ఓటు హక్కుకు ముప్పును అరికట్టాలి: సీపీఐ బాల నరసింహ

Gadwal: గద్వాలలో నిర్వహించిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల చోరీని అరికట్టాలని, కరువు రైతులకు పరిహారం ఇవ్వాలని బాల నరసింహ డిమాండ్ చేశారు.

GOKARANNA,  GADWAL
Published on: 7 Nov 2026 9:08 PM IST
Gadwal
X

Gadwal: ఓటు హక్కుకు ముప్పును అరికట్టాలి: సీపీఐ బాల నరసింహ

గద్వాల జిల్లా: గద్వాల జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా సమితి సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ మాట్లాడుతూ... తీవ్ర కరువు పరిస్థితులతో రైతులు పంటలు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరువు బాధిత రైతులకు ఎకరాకు తగిన పంట నష్టపరిహారం చెల్లించడంతో పాటు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పరిహార ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL