Makthal: కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు నమ్మరు మక్తల్‌లో బిజెపి నేతల ధ్వజం

Makthal: కాంగ్రెస్‌ ఢిల్లీ ధర్నాలు మాని, ఓట్ల తొలగింపు నిజాలు తెలుసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్‌తో వచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు: బీజేపీ.

B. NARENDER, MAKTHAL
Published on: 29 Oct 2026 4:17 PM IST
Makthal
X

Makthal: కాంగ్రెస్ డ్రామాలను ప్రజలు నమ్మరు మక్తల్‌లో బిజెపి నేతల ధ్వజం

Makthal: బిజెపి ఓటు చోరీ చేసిందని ప్రజలను మభ్య పెట్టడం మానుకోవాలి.పక్కన కర్ణాటక రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల లో నాలుగు స్థానాలను బిజెపి జేడీయు కూటమి కైవసం చేసుకుంది. ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేక పోయింది. కారణం మీకు తెలియదా. ప్రజలు మిమ్మల్ని మీ పార్టీని నమ్మే స్థితిలో లేరు.

దానిని కప్పిపుచ్చుకోవడానికే మీ పార్టీ చీటికిమాటికి ఢిల్లీలో అల్లర్లు చేసి ప్రపంచ దేశాల దృష్టి లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టకు కుట్రలు పన్నుతున్నారని, ఎవరు ఎన్ని చేసినా దేశ ప్రజలు గాని ప్రపంచ దేశాల నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఇటీవల కర్ణాటక మహారాష్ట్ర, బీహార్, అస్సాం రాష్ట్రాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయా రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాతపెట్టిన విషయం మర్చిపోతున్నారా అని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా మాత్రమే బిజెపి గెలుస్తోందని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహిస్తే కూడా ప్రజలు బిజెపికి ఓటు వేసి గెలిపించారు.ఇది చాలదా మీకు అని ప్రశ్నించారు.ప్రజలకు ప్రధాని మోడీ పైన, భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని రుజువు చేశారని అన్నారు.

బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా చూయిస్తామని కాంగ్రెస్ పెద్దలు గొప్పలు చెప్పుకుంటారు, బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించిన ఎన్నికలలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారని విమర్శించారు. మీరు కోరిన విధంగా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం ప్రజలకు మీ మీద మీ పాలన పైన నమ్మకం పోవడం కాదా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులంతా మీ కిందనే పనిచేస్తున్నారు కదా.

మరి ఎందుకు ఓటేయలేదు.?.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా. ఇప్పటికైనా ప్రజల మనసును అర్థం చేసుకోవాలని హితువు పలికారు. ఇకనుండి అయినా బిజెపి పైన..కేంద్ర ప్రభుత్వం పైన..ప్రధాని మోడీ పైన బురదలడం మానుకొని మంచి పనులు చేసి ప్రజల మనసును గెలిచే ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారు. ఓటు చోరీ జరిగిందని అనవసర రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, దానితోక పార్టీల నాయకులు ఒక్క రుజువు అయినా చూయించగలరా అని ప్రశ్నించారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా పటిష్టంగా జరుగుతోందని అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించడం లేదని తెలిపారు.అలాగే అనర్హులైన వారి ఓట్లను మాత్రం తొలగిస్తున్నారని తెలిపారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ అత్యంత నిష్ణాతులైన ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారి ఓట్లను తొలగించడం ఎస్ఐఆర్ ఉద్దేశం ఎంత మాత్రం కాదన్నారు. ముఖ్యంగా మరణించిన వారి ఓట్లు కూడా ఓటర్ల జాబితాలో సంవత్సరాల తరబడి ఉన్న నేపథ్యంలో వాటిని మాత్రం తొలగించడం జరుగుతోందని తెలిపారు.

అనర్హులైన వారి పేర్లను తొలగిస్తూ అర్హులైన 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతోపాటు, అనరుహులైన వారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు హక్కు కలిగిన వారి పేరును జాబితా నుండి తొలగించడం,అలాగే మరణించిన వారి పేరును ఓటర్ల జాబితా నుండి తొలగించడం మాత్రం చేస్తున్నారని తెలిపారు.

అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో అనర్హులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడం కూడా అంతే ముఖ్యమని వారు అన్నారు.కొందరు తమ సొంత ఊరిలోనూ పట్టణాలలోనూ ఓటు హక్కును కలిగి ఉన్నారని, మరి కొంతమంది ఒక్కొక్కరు నాలుగు చోట్లలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారని అలాంటి వారికి వారి ఇష్ట ప్రకారం ఏదో ఒకచోట ఓటర్ల జాబితాలో వారి పేరును ఉంచి మిగతా వాటిని తొలగించడం జరుగుతుందని తెలిపారు.

ఇది న్యాయ సమ్మతం కాదా అని వారు ప్రశ్నించారు.చాలామంది తమ సొంత ఊర్లలోను హైదరాబాదు లాంటి నగరాలలోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారని అలాంటి వారికి వారి ఇష్ట ప్రకారం ఏదో ఒక చోట మాత్రమే ఓటర్ల జాబితాలో పేర్లు ఉంచడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం మొత్తం ఏ రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం లేకుండా అత్యంత నిష్ణాతులైన అధికారుల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు.

అక్కడక్కడ ఎక్కడో ఒకచోట మీ పార్టీపై ఉన్న అభిమానాన్ని కూడా మీ చర్యల వల్ల మీరే దూరం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు ఎల్ ని నో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షం లేక పంటలు ఎండిపోతుంటే అధికారంలో ఉన్న మీరు రాష్ట్ర ప్రజలకు అలాగే రైతాంగానికి అండగా ఉండి వారి కష్టాలను దూరం చేయకుండా మీ రాజకీయ లబ్ధి కోసం దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడమే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మీరు ఏమి చేసినా ప్రజలు నమ్మబోరని తెలిపారు.

అప్రకటిత కరెంటు కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతులు విలవిలాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ లబ్ధి కోసం మీరు ఢిల్లీలో ధర్నా పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ఒకవైపు ప్రజలు వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజల హృదయాలనుండి మరింత దూరం పోతుందని గుర్తు చేశారు.

మీ పార్టీకి ఎవరో నష్టం చేయడం లేదని మీరే మీ చర్యల వల్ల ప్రజలకు దూరం అవుతున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా ఇలాంటి చౌక వారు పనులు మానుకొని ప్రజలకు మేలు చేసి ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేయాలని హితువు పలికారు. లేకుంటే రాబోవు ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి మక్తల్ మండల అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కానాపురం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL