Makthal: సోమేశ్వర బండ గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

Makthal: నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం సోమేశ్వర బండ గ్రామంలో నూతన కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా నర్సిములు ఎన్నికయ్యారు.

B. NARENDER, MAKTHAL
Published on: 11 Nov 2026 4:10 PM IST
Makthal
X

Makthal: సోమేశ్వర బండ గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!

Makthal: నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలం లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు మక్తల్ మండలంలోని సోమేశ్వర బండ గ్రామంలో నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులుగా నర్సిములు ఉపాధ్యక్షులు కోశాధికారి పార్టీ ముఖ్య నాయకులు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సోమేశ్వర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరి సమక్షంలో ఐక్యతతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఈ ఎన్నిక జరిగింది. నూతన కమిటీ గ్రామంలో పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని నాయకులు ఆకాంక్షించారు.

ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా,సర్పంచ్ సత్యరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు

చెన్నయ్య గౌడ్ ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు నర్సిములు గారికి మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL