Devarkadra: బస్వాయిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన అధికారులు, నాయకులు!
Devarkadra: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో అందజేత.
Devarkadra: బస్వాయిపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన అధికారులు, నాయకులు!
Devarkadra: బస్వాయిపల్లి గ్రామంలో సోమవారం రోజు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు నోచుకోని అర్హులైన పేద కుటుంబాలకు, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ క్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు బస్వాయిపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ GPO నాగేశ్వర్, పంచాయతీ కార్యదర్శి జయసుధ, గ్రామ సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ గోవర్ధన్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విక్రవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




