Achampet: అచ్చంపేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో శివ పార్వతి కళ్యాణోత్సవం!

Achampet: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం శివ పార్వతి కళ్యాణోత్సవం, కార్తీక కోటి దీపోత్సవం ఘనంగా జరిగాయి.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 24 Nov 2026 9:12 PM IST
Achampet
X

Achampet: అచ్చంపేట కన్యకా పరమేశ్వరి ఆలయంలో శివ పార్వతి కళ్యాణోత్సవం!

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శివ పార్వతి కళ్యాణోత్సవం, కార్తీక కోటి దీపోత్సవం ఘనంగా జరిగాయి. అధ్యక్షులు కొరివి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పాపిశెట్టి బాలరాజ్, కోశాధికారి రామిరెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో శివ పార్వతి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు.

అనంతరం భక్తులు కార్తీక కోటి దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం దీపకాంతులతో శోభాయమానంగా మారింది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA