Makthal: మక్తల్ సెట్విన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
Makthal: మక్తల్ సెట్విన్ సాంకేతిక శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలితమ్మ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Makthal: మక్తల్ సెట్విన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
Makthal: మక్తల్ పట్టణంలోని సెట్విన్ సాంకేతిక శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలితమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం,సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు.
అనంతరం అందరికీ బతుకమ్మ పండుగతోపాటు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెట్విన్ కో ఆర్డినేటర్ విజయ్ కుమార్, స్థానిక వార్డు కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య నీల గౌడ్, సెట్విన్ ట్రెయినర్లు తిమ్మప్ప, స్వప్న, వీరమ్మ, ఫర్హానా, సిబ్బంది ప్రవీణ్, లక్ష్మీ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.




