Veldanda: కంటోనిపల్లిలో జావాజ్ అంజయ్య మృతి పట్ల సర్పంచ్ సంతాపం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కంటోనిపల్లికి చెందిన జావాజ్ అంజయ్య మృతి చెందడంతో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులర్పించారు.
Veldanda: కంటోనిపల్లిలో జావాజ్ అంజయ్య మృతి పట్ల సర్పంచ్ సంతాపం!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కంటోనిపల్లి గ్రామానికి చెందిన జావాజ్ అంజయ్య మృతి చెందడంతో విషయం తెలుసుకున్న వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంజయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ అంజయ్య మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు.
ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంజయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అంజయ్య మృతి పట్ల గ్రామస్తులు, బంధువులు సంతాపం వ్యక్తం చేశారు.




