Nagarkurnool: వెల్దండలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో అనారోగ్యంతో మృతి చెందిన దండుగుల నారయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Sept 2026 12:51 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: వెల్దండలో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన దండుగుల నారయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ బుధవారం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొయ్యల పుల్లయ్య, మారేపల్లి శ్రీనివాస్, మట్ట భరత్, రేవల్లి దర్గయ్య, రేవల్లి బాలరాజు, కనుగుల వెంకటయ్య, మట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY