Veldanda: గుండాల ఆలయానికి ఐమాక్స్ లైట్లు అందజేసిన సర్పంచ్

Veldanda: వెల్దండ మండలం గుండాల అంబా రామలింగేశ్వర దేవాలయానికి బండోనిపల్లి సర్పంచ్ సంగీత శేఖర్‌రెడ్డి రూ.30 వేల విలువైన 3 ఐమాక్స్ లైట్లు అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Nov 2026 12:32 PM IST
Veldanda
X

Veldanda: గుండాల ఆలయానికి ఐమాక్స్ లైట్లు అందజేసిన సర్పంచ్

నాగర్కర్నూల్ జిల్లా: వెల్దండ మండలం : గుండాల గ్రామంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న గుండాల అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా బండోనిపల్లి గ్రామ సర్పంచ్‌ సంగీత శేఖర్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి రూ.30 వేల విలువైన మూడు ఐమాక్స్‌ లైట్లను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ సంగీత శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రాంతంలోని అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటని అన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని కోరారు. దేవాలయానికి అవసరమైన సౌకర్యాల కల్పనకు సహకరిస్తానని తెలిపారు.

అనంతరం ఆలయ అర్చకులు సర్పంచ్‌ సంగీత శేఖర్‌రెడ్డి దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY