Nagarkurnool: మంత్రి శంకుస్థాపన చేసినా నిలిచిన పనులు.. అటవీశాఖ అడ్డంకులతో బ్రేక్!

Nagarkurnool: దోమలపెంటలో రూ.16 కోట్లతో మంత్రి జూపల్లి శంకుస్థాపన చేసిన పర్యాటక పనులు అటవీశాఖ అడ్డంకులతో నిలిచిపోయాయి. నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం నెలకొంది.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 21 Nov 2026 2:09 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మంత్రి శంకుస్థాపన చేసినా నిలిచిన పనులు.. అటవీశాఖ అడ్డంకులతో బ్రేక్!

Nagarkurnool: తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక నల్లమల ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి లో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం కృష్ణా నది తీర ప్రాంతం దోమల పెంట సమీపంలో రూ 16 కోట్లతో స్వయంగా పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఏడాది గడిచిన అటవీశాఖ అడ్డంకులతో పర్యాటక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట ఈగలపెంట గ్రామాలలో పాటు శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలో తెలంగాణ వైపున పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేసినా, అటవీశాఖ ఉన్నతాధికారులు అనుమతులు లేని పనులను చేపట్టకుండా నిలిపివేశారు.

శ్రీశైలం డ్యామ్ నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వం డ్యామ్ కు ఎడమ వైపున ఉన్న ఈ గలపెంట, దోమలపెంట ఎడమ పాతాళగంగ పరిసర ప్రాంతాల పరిధిలో 890 ఎకరాల అటవీ భూమిని నీటి పారుదల శాఖకు బదలాయించారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉంది.

2016 సంవత్సరంలో ప్రధానమంత్రి స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా దోమలపెంట పంచాయతీ పరిధిలో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు అప్పటి నీటిపారుదల శాఖ అనుమతి (ఎన్ఓసీ) ఇచ్చి పర్యాటక శాఖకు అప్పగించింది. 2016లోనే అటవీ శాఖ అధికారులు కూడా ఎన్ఓసీని అందజేసి రూ. 20 కోట్లు అభివృద్ధి పనులకు కేటాయించారు.

నాగర్‌కర్నూల్ జిల్లాకు ప్రత్యేక నిధుల కింద ప్రభుత్వం రూ. 68.10 కోట్లు కేటాయించగా, దోమలపెంట రూ. 19.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇందులో కృష్ణానది ఒడ్డున నిర్మాణం కోసం రూ. 16 కోట్లనిధులుకేటాయించారు.కాగా, గత సంవత్సరం ఆగస్టులో కృష్ణానది ఒడ్డున పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు,రూ 16కోట్ల తో పర్యాటక మంత్రి శంకుస్థాపన చేసి ఏడాది గడిచిన ముందుకు సాగని పనులు:

తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక నల్లమల ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి లో భాగంగా అచ్చంపేట నియోజకవర్గం కృష్ణా నది తీర ప్రాంతం దోమల పెంట సమీపంలో రూ 16 కోట్లతో స్వయంగా పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఏడాది గడిచిన అటవీశాఖ అడ్డంకులతో పర్యాటక అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట ఈగలపెంట గ్రామాలలో పాటు శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలో తెలంగాణ వైపున పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేసినా, అటవీశాఖ ఉన్నతాధికారులు అనుమతులు లేని పనులను చేపట్టకుండా నిలిపివేశారు.

శ్రీశైలం డ్యామ్ నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వం డ్యామ్ కు ఎడమ వైపున ఉన్న ఈ గలపెంట, దోమలపెంట ఎడమ పాతాళగంగ పరిసర ప్రాంతాల పరిధిలో 890 ఎకరాల అటవీ భూమిని నీటి పారుదల శాఖకు బదలాయించారు. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉంది.

2016 సంవత్సరంలో ప్రధానమంత్రి స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా దోమలపెంట పంచాయతీ పరిధిలో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టేందుకు అప్పటి నీటిపారుదల శాఖ అనుమతి (ఎన్ఓసీ) ఇచ్చి పర్యాటక శాఖకు అప్పగించింది. 2016లోనే అటవీ శాఖ అధికారులు కూడా ఎన్ఓసీని అందజేసి రూ. 20 కోట్లు అభివృద్ధి పనులకు కేటాయించారు.

నాగర్‌కర్నూల్ జిల్లాకు ప్రత్యేక నిధుల కింద ప్రభుత్వం రూ. 68.10 కోట్లు కేటాయించగా, దోమలపెంట రూ. 19.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇందులో కృష్ణానది ఒడ్డున నిర్మాణం కోసం రూ. 16 కోట్లనిధులుకేటాయించారు.కాగా, గత సంవత్సరం ఆగస్టులో కృష్ణానది ఒడ్డున పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఇతర ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు చేపడుతుండగా, అటవీ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో పనులు నిలిచిపోయాయి.

ఈ ఏడాది మార్చి నాటికి నిర్మాణ పనులు కోసం నిధులు ఖర్చు చేయకపోతే రూ. 19.50 కోట్లు వెనుతిరుగుతాయని పర్యాటకశాఖాధికారులు పేర్కొంటున్నారు. దీంతో పనులు పూర్తి కాకుండానే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి భూమిపూజ చేసినా నిలిచిన పనులు..

నల్లమల ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు సర్వము సిద్ధమైనా, అటవీశాఖ అనుమతుల విషయంలో సృష్టిస్తున్న జాప్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. మంత్రి స్వయంగా భూమిపూజ చేసిన పనులు కూడా మధ్యలోనే ఆగిపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇబ్బందులు సృష్టిస్తున్న అటవీశాఖ..

దోమలపెంట లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇంతకు ముందే అనుమతులు పొందినప్పటికీ అటవీశాఖ అధికారులు మరోమారు అనుమతి పొందితేనే నిర్మాణం చేపట్టాలి అని చెబుతున్నారు. ఆ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం వల్ల కాంట్రాక్టర్ పనులు వదిలేసి పరారీ అయ్యాడు.

పర్యాటక శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం, 2016లో ఇచ్చిన ఎన్ఓసీ ఇప్పటికీ చెల్లుబాటు అవుతుందని, మళ్లీ కొత్త అనుమతులు అవసరం లేదని అంటున్నారు. కానీ అటవీశాఖ మాత్రం అనుమతి పత్రం ఉంటేనే నిర్మాణం చేపట్టాలంటూ పట్టుబడుతోంది. దీంతో రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

చేపట్టాల్సిన పనులు..

దోమలపెంట లో అక్కమహాదేవి గుహల సందర్శన కోసం వచ్చే పర్యాటకులు, శ్రీశైలం వెళ్లే పర్యాటకుల వీడి కోసం నిర్మాణం చేపట్టేందుకు మంజూరైన పనులు ఇలా ఉన్నాయి.

డ్యామ్ సమీపంలో పర్యాటక ముఖద్వారం, తూగలపెంట, మ్యూజియం, అతిథి గృహం దగ్గర చెంచులక్ష్మి కళా మ్యూజియం, హస్తకళా ప్రదర్శన కేంద్రం, టికెట్ కౌంటర్, మత్స్యకారుల కాలనీ దగ్గర పర్యాటకుల కోసం విశ్రాంతి గది, క్యాంటీన్, డ్రైవర్స్ షెల్టర్, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వాహనాల పార్కింగ్, సమాచార కేంద్రం తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.

ఈ పనులన్నీ పూర్తయితే దోమలపంట, ఈగలపెంట ప్రాంతం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. స్థానిక చెంచు గిరిజనులకు, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. శ్రీశైలం వచ్చే భక్తులు, పర్యాటకులు తెలంగాణ వైపు కూడా ఆగి సందర్శించే అవకాశం కలుగుతుంది.

పర్యాటక శాఖ ఆవేదన..

“మేము నిధులు తెచ్చాము, మంత్రితో శంకుస్థాపన చేయించాము, పనులు మొదలుపెట్టాము. కానీ అటవీశాఖ అనుమతుల పేరుతో అడ్డుకుంటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలి” అని పర్యాటక శాఖ అధికారులు అంటున్నారు.

రెండు శాఖ వివాదం లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

రెండు శాఖల మధ్య వివాదం కారణంగా ప్రజా ధనం వృధా కాకుండా, నిధులు వెనక్కి వెళ్లకుండా ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు జోక్యం చేసుకుని అటవీశాఖ, పర్యాటక శాఖ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం కుదర్చాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

:నిలిచిపోయిన పనులను పరిశీలిస్తున్న టూరిజం శాఖ అధికారులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఇతర ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు చేపడుతుండగా, అటవీ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో పనులు నిలిచిపోయాయి.