Vangoor: మృతురాలి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్
Vangoor: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో వృద్ధురాలు అంతమ్మ మృతి చెందగా, ఆమె కుటుంబానికి మాజీ సర్పంచ్ వేనేపల్లి గణేష్ రావు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
Vangoor: మృతురాలి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్
నాగర్‌కర్నూల్ జిల్లా: వంగూరు మండల కేంద్రానికి చెందిన చింతకుంట్ల అంతమ్మ (93) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వేనేపల్లి గణేష్ రావు, మాజీ సర్పంచ్ గంధం లింగయ్య, మాజీ సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లాగౌడ్, గ్రామ ఉపసర్పంచ్ బండపల్లి భాస్కర్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు రూ.10,000/ వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు బండపల్లి జంగయ్య, వార్డు సభ్యులు సుమన్, అక్కి మురళి, నారమోని జంగయ్య, బండపల్లి శివకుమార్, లట్టుపల్లి మురళి, ఆలేరు మల్లేష్, తుమ్మలపల్లి లక్ష్మయ్య, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఎల్లికంటి మురళి, బాషమోని కృష్ణ, దామోదర్, లట్టుపల్లి సాయిలు, సి. లక్ష్మయ్య, రమేష్, బండపల్లి శ్రీశైలం, భాషమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.




