Mahabubnagar: మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ చైర్మన్ రవి కుమార్‌కు ఘన సన్మానం!
Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కె.ఎస్. రవి కుమార్‌ను సత్కరించిన బీఆర్ఎస్ నాయకులు జూపల్లి భాస్కర్ రావు.
Mahabubnagar: మహబూబ్‌నగర్ రెడ్‌క్రాస్ చైర్మన్ రవి కుమార్‌కు ఘన సన్మానం!
Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కె.ఎస్. రవి కుమార్‌ను ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జూపల్లి భాస్కర్ రావు అభినందించి ఘనంగా సన్మానించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని జై ప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ కె.ఎస్. రవి కుమార్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా జూపల్లి భాస్కర్ రావు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవి కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
అనంతరం కె.ఎస్. రవి కుమార్ మాట్లాడుతూ, తన ఎన్నిక సందర్భంగా జూపల్లి భాస్కర్ రావు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జూపల్లి భాస్కర్ రావు మాట్లాడుతూ, కె.ఎస్. రవి కుమార్ నాయకత్వంలో మహబూబ్‌నగర్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సమాజంలోని పేదలు, నిరుపేదలు, ఆపదలో ఉన్నవారికి రెడ్‌క్రాస్ ద్వారా మరింత సేవలు అందించి ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు. రవి కుమార్ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు.




